కోలీవుడ్లోకి సందీప్ రెడ్డి వంగా ఎంట్రీ.. !
3/11/2026

టాలీవుడ్ డైరెక్టర్స్ మెగాఫోన్ పట్టడమే కాదు.. వీలైతే సిల్వర్ స్క్రీన్‌పై నటులుగానూ మెప్పిస్తున్నారు. రాజమౌళి, పూరి జగన్నాథ్, తరుణ్ భాస్కర్ సహా పలువురు డైరెక్టర్స్ యాక్టర్స్గానూ మెప్పించారు. తాజాగా ఈ లిస్టులో మరో డైరెక్టర్ చేరారు. ఆయనెవరో కాదు.. సందీప్ రెడ్డి వంగా. అయితే ఆయన తెలుగు సినిమాలో కాకుండా తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా అనే వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ స్టార్ హీరో శింబు (సిలంబరసన్), విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘అరసన్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల చేయనున్న ప్రత్యేక ప్రోమోలో టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ‘అరసన్’ ప్రోమోలో కనిపించనున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివరాల మేరకు.. దీపావళి సందర్భంగా విడుదల చేయనున్న స్పెషల్ వీడియోలో సందీప్ రెడ్డి వంగా భాగమైనట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన పాత్ర ఏమిటి? కేవలం అతిథి పాత్రలో కనిపిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
2027లో ‘అరసన్’ విడుదల?
వాస్తవానికి ‘అరసన్’ సినిమాను 2026 దీపావళికి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే అనుకున్న సమయానాకి షూటింగ్ పూర్తి కాకపోవటంతో సినిమా విడుదల 2027కు వాయిదా పడింది. సంక్రాంతి 2027కి కూడా సినిమా విడుదల కావడం లేదని శింబు గతంలోనే స్పష్టం చేశారు. అయితే అభిమానులను నిరాశపరచకుండా దీపావళి సందర్భంగా ‘అరసన్’కు సంబంధించిన ప్రత్యేక ప్రోమోను విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తుంది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
