శ్రీలీలకు ఈసారైనా హిట్ వస్తుందా!
5/11/2026

టాలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ప్రస్తుతం కెరీర్‌లో కొత్త ఛాలెంజ్ ఎదురవుతోంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపిన ఈ బ్యూటీకి ఇటీవల ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కోలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలుగులో శ్రీలీల నటించిన సినిమాల్లో సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ పడలేదు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై చాలా ఆశలనే పెట్టుకుంది. అయితే ఆ సినిమా కూడా ఆమెకు ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయింది. దీంతో ఇతర భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రీలీలకు అక్కడ కూడా తొలి ప్రయత్నంలో విజయం దక్కలేదు. అయినా అవకాశాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి లేదు. ఏకంగా ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాల్లో చోటు దక్కించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘డేర్ డెవిల్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాతో అజిత్ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమాలోనూ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. కమల్ హాసన్ నిర్మాణ సంస్థకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో ఆమె భాగం కావడం విశేషం. చిత్ర యూనిట్ శ్రీలీలను అధికారికంగా పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది. అందులో ఆమెను ‘ది స్పార్క్’, ‘ది పటాకా’ అంటూ పరిచయం చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగు సినిమాల కంటే తమిళ, హిందీ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగులో ఆశించిన విజయాలు దక్కకపోయినా ఇతర భాషల్లో మాత్రం తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా అజిత్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్. అయితే స్టార్ హీరోల సినిమాల్లో నటించడం ఒక ఎత్తయితే వాటితో విజయాన్ని అందుకోవడం మరో ఎత్తు. మరి అజిత్, రజనీకాంత్ సినిమాలైనా శ్రీలీలకు సాలిడ్ హిట్ అందించి కెరీర్‌ను మళ్లీ గాడిలో పెడతాయా? ఈ రెండు ప్రాజెక్టులతోనైనా అమ్మడి దశ తిరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
