కృతిశెట్టికి ఈసారైనా కలిసొస్తుందా.. !
12/11/2026

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ కృతి శెట్టికి ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. తొలి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా 2022 సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ కృతి కెరీర్‌లో తొలి పొంగల్ మూవీగా నిలవడమే కాకుండా, ఆమెకు హ్యాట్రిక్ సక్సెస్‌ను అందించింది.
అయితే ఆ తర్వాత కృతి శెట్టికి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. వరుస సినిమాలు చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌లో మళ్లీ ఒక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి సంక్రాంతి సీజన్‌లోనే కృతి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘జనవరి 12న విడుదల’లో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 12నే విడుదల చేస్తున్నారు మరి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కృతి కెరీర్‌లో హిట్ అందించిన ‘బంగార్రాజు’ కూడా మల్టీస్టారర్ మూవీనే. ఇప్పుడు ఆమె నటించబోతున్న ఈ సినిమా కూడా మరో మల్టీస్టారర్ కావడం విశేషం. అలాగే కృతికి జనవరి 12 సెంటిమెంట్ మరోసారి కలిసొస్తుందా? ‘బంగార్రాజు’ తరహాలో ఈ సినిమా కూడా ఆమెకు బాక్సాఫీస్ సక్సెస్ అందిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతోనైనా కృతి శెట్టి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి తన కెరీర్‌కు కొత్త బూస్ట్ తెచ్చుకుంటుందేమో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
