దేవిశ్రీ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా!
3/11/2026

దేవిశ్రీ ప్రసాద్‌కు ‘దేవి’ సినిమా చాలా ప్రత్యేకం. ఎందుకంటే సంగీత దర్శకుడిగా ఆయన కెరీర్‌ను ప్రారంభించింది ఈ సినిమాతోనే. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం.ఎస్. రాజు నిర్మించిన ‘దేవి’ మార్చి 12, 1999న విడుదలైంది. ఈ సినిమాతోనే డీఎస్పీ సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత అదే మార్చి నెలలో మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు.అదేంటనే వివరాల్లోకి వెళితే..
దేవిశ్రీఆ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ సంగీత దర్శకుడిగా పరిచయమైన సినిమా పేరు ‘దేవి’. ఈ మూవీ మార్చి నెలలోనే రిలీజైంది. అది ఆయన జర్నీకి స్టార్టింగ్ పాయింట్. అయితే ఇప్పుడు కథానాయకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన హీరోగా పరిచయమవుతున్న సినిమా పేరు ‘ఎల్లమ్మ’. ఈ రెండు సినిమాల పేర్లు కూడా అమ్మవార్లకు సంబంధించినవే కావడం విశేషం. అప్పట్లో ‘దేవి’ సినిమాతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.
హీరోగా డీఎస్పీ ఎలా మెప్పిస్తారు?
‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి ఎల్లమ్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో డీఎస్పీ ‘పార్షి’ అనే పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు నటుడిగా ఎలాంటి ముద్ర వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ‘దేవి’తో మొదలైన ఆయన సినీ ప్రయాణం.. ‘ఎల్లమ్మ’తో మరో విజయవంతమైన మలుపు తిరుగుతుందా? అనేది చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
