మెగాస్టార్‌తో సినిమా ఎందుకు ఆగిపోయిందంటే.. డైరెక్టర్ వెంకీ కుడుముల క్లారిటీ!
11/11/2026

మెగాస్టార్‌తో సినిమా ఎందుకు ఆగిపోయిందంటే.. డైరెక్టర్ వెంకీ కుడుముల క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సి ఉంది. భారీ అంచనాల మధ్య మొదలుకావాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాలతో ఆగిపోయింది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలను రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వెంకీ కుడుముల వెల్లడించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ కథను సిద్ధం చేసినట్లు వెంకీ తెలిపారు. ఇందులో చిరంజీవి 18 నుంచి 20 ఏళ్లు జైలులో ఉండి బయటకు వచ్చిన మాజీ ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించే పాత్ర. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో జీవించిన వ్యక్తి.. ఇన్నేళ్ల తర్వాత మారిపోయిన సమాజంలోకి అడుగుపెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశంతో కథను రూపొందించారట. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో వంటి ఆధునిక ప్రపంచానికి ఆ వ్యక్తి ఎలా అలవాటు పడతాడనే విషయాలను వినోదాత్మకంగా చూపించాలనుకున్నారట.
అయితే కథలోని సెకండాఫ్ విషయంలో చిరంజీవి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని వెంకీ వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేదు. మరో మంచి కథతో వస్తే తప్పకుండా సినిమా చేద్దామని చిరంజీవి చెప్పినట్లు ఆయన తెలిపారు. ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల ప్రస్తుతం నిర్మాతగా ‘ఇట్లు అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక చిరంజీవి కోసం సిద్ధం చేసిన ఈ మాజీ ఫ్యాక్షనిస్ట్ కథ ఆసక్తికరంగా ఉండటంతో.. మెగాస్టార్ ఈ పాత్రలో నటించి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
