movies

నస్లెన్‌కు సూర్య సర్‌ప్రైజ్ గిఫ్ట్.. లక్షల విలువైన కార్టియర్ వాచ్ వెనుక అసలు కథ!

19/11/2026

నస్లెన్‌కు సూర్య సర్‌ప్రైజ్ గిఫ్ట్.. లక్షల విలువైన కార్టియర్ వాచ్ వెనుక అసలు కథ!

సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు మరో నటుడి ప్రతిభను గుర్తించి అభినందించడం సాధారణమే. అయితే ఆ అభినందన ఒక విలువైన బహుమతి రూపంలో ఉంటే మాత్రం ఆ విషయం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన విలన్‌ నస్లెన్‌కు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్‌గా మారింది. సీన్ సినిమాలో సూర్యతో కలిసి నటించిన నస్లెన్‌కు ఆయన ఖరీదైన కార్టియర్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. మలయాళంలో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న నస్లెన్‌కు ఇది తమిళంలో తొలి సినిమా కావడం మరో విశేషం.

నస్లెన్ తన నెక్ట్స్ మూవీ బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో తన చేతికి ఉన్న వాచ్‌ను చూపించడంతో ఈ గిఫ్ట్ విషయం బయటకు వచ్చింది. అది కార్టియర్ సాంటోస్ వాచ్ అని, దాని విలువ సుమారు రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నస్లెన్‌తో పాటు ఇంటర్వ్యూలో పాల్గొన్న కుంచాకో బోబన్ కూడా ఆ వాచ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. సరదాగా సూర్య ఫోన్ నంబర్ తనకు కూడా ఇవ్వాలని అడిగటం ఆసక్తికరంగా మారింది.

జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సీన్‌ మూవీలో సూర్య హీరోగా నటించారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా, నస్లెన్ మెయిన్‌ విలన్‌గా కనిపించారు. ఇందులో నస్లెన్ ఈశ్వరన్ అనే కిరాయి హంతకుడి పాత్రలో కనిపించారు. ఇప్పటివరకు మలయాళ సినిమాల్లో ఎక్కువగా చూసిన ఆయన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ముఖ్యంగా మలయాళంలో యూత్‌ఫుల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నస్లెన్‌ను ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించటం సినిమాలకు ప్లస్ అయ్యింది. నస్లెన్ టాలెంట్ మీద తనకు ముందునుంచే నమ్మకం ఉందని, ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు దర్శకుడు జీతూ మాధవన్ చెప్పారు. విడుదలైన తర్వాత ఆయన నటనకు మంచి స్పందన రావడంతో పాటు, ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూర్య కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email