ధనుష్ కారులో..మీడియాను చూడగానే ముఖం తిప్పేసిన బ్యూటీ ఎవరో!
3/11/2026

సౌత్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ గురించి కొంతకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో పలుమార్లు ప్రచారం జరిగింది. అంతేకాదు.. వీరి పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ గతంలో ఆమె సోషల్ మీడియా వేదికగా వివరణ కూడా ఇచ్చింది. దీంతో అప్పట్లో ఆ వార్తలకు చెక్ పడింది. అయితే తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్ దగ్గర చోటుచేసుకున్న ఓ విషయం మరోసారి ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి.
రీసెంట్‌గా ధనుష్ చెన్నై నుంచి ముంబైకి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆయన కారులో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో కారు ముందు సీట్లో ఓ మహిళ కనిపించడం అక్కడున్న ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించింది. కెమెరాలు తనవైపు తిరగగానే ఆ మహిళ ముఖాన్ని చేతులతో కప్పేసుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆ కారులో ఉన్నది మృణాల్ ఠాకూరే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఇప్పటికే ధనుష్, మృణాల్ మధ్య ఏదో ఉందంటూ వార్తలు వస్తుండటంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రచారంపై ఇద్దరిలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఏది ఏమైనా ధనుష్, మృణాల్ రిలేషన్‌షిప్ గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఆ వీడియోలో కనిపించిందెవరు? ధనుష్, మృణాల్ మధ్య వస్తున్న వార్తల్లో నిజమెంత? అనేది మాత్రం అధికారిక స్పష్టత వచ్చే వరకు సస్పెన్సే!
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
