movies

‘ఆద‌ర్శ కుటుంబం’పై న‌టి పూజిత పొన్నాడ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌!

19/11/2026

‘ఆద‌ర్శ కుటుంబం’పై న‌టి పూజిత పొన్నాడ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌!

సినిమా అవకాశాల విషయంలో నటీనటులకు ఎదురయ్యే అనుభవాలు ఒక్కోసారి ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా పెద్ద దర్శకులు, స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే నటీనటుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఆ అవకాశం చివరకు చేదు అనుభవంగా మిగిలితే వారి బాధ వర్ణనాతీతం. తాజాగా అలాంటి అనుభవాన్నే నటి పూజిత పొన్నాడ బయటపెట్టారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

రీసెంట్‌గా న‌టి పూజిత పొన్నాడకు ‘ఆదర్శ కుటుంబం’లో మంచి పాత్ర చేసే అవకాశం వచ్చిందట. తాను యూకేలో ఉన్న సమయంలో సినిమా టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మంచి పాత్ర ఉందని చెప్పడంతో వెంటనే హైదరాబాద్ వచ్చానని ఆమె వెల్లడించారు. ఆడిషన్, లుక్ టెస్ట్, ఫొటోషూట్ నిర్వహించిన తర్వాత త్రివిక్రమ్ తనను ఎంపిక చేశారని తెలిపారు. అంతేకాదు, తన పాత్ర గురించి సుమారు గంటన్నర పాటు కథ కూడా వివరించారని చెప్పారు. సినిమాలో మొదటి నుంచి చివరి వరకు తన పాత్ర ఉంటుందని, నారా రోహిత్‌తో మంచి సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నానని పూజిత పేర్కొన్నారు.

సినిమా కోసం అగ్రిమెంట్ పూర్తిచేసుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్న పూజిత.. తొలి షెడ్యూల్‌లో ఐదు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారట. అయితే ఆ తర్వాత దాదాపు మూడు నెలల పాటు రెండో షెడ్యూల్ గురించి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. ఈ క్రమంలో తన పాత్రకు ఏమైనా మార్పులు జరిగాయా అని కో-డైరెక్టర్‌ను అడిగితే.. పాత్ర తగ్గడం కాదు, ఇంకా పెరుగుతుందని చెప్పారట. త్రివిక్రమ్ తన క్యారెక్టర్‌ను మరింత బాగా రాస్తున్నారని చెప్పిన కొద్ది రోజులకే తన మేనేజర్ నుంచి ఫోన్ వచ్చిందని, ఇక తనకు షూటింగ్ లేదని చెప్పడంతో షాక్ అయ్యానని పూజిత తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించినా సరైన సమాధానం రాలేదని, చివరకు తన పాత్రలోకి మరో నటిని తీసుకున్నారని తెలిసిందని చెప్పారు. తనతో పాటు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులను కూడా మార్చేశారని వెల్లడించారు. ఇంత ప్రాసెస్ చేసి ఎంపిక చేసిన తర్వాత కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా తొలగించడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక సినిమా విడుదలైన తర్వాత థియేటర్‌లో చూసినప్పుడు మరో విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పూజిత చెప్పారు. సినిమాలో పోలీస్ స్టేషన్ సన్నివేశంలో తాను కేవలం ఒక చిన్న సీన్‌లో కనిపించానని, అది కూడా దాదాపు 40 నుంచి 50 సెకన్ల నిడివి మాత్రమే ఉందని తెలిపారు. తన పాత్రలో మరో నటిని తీసుకున్నప్పుడు, అప్పటికే చిత్రీకరించిన తన సన్నివేశాన్ని సినిమాలో ఎందుకు ఉంచారో అర్థం కాలేదని అన్నారు. కనీసం తనకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు.

మొత్తానికి త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో మంచి పాత్ర వస్తుందని ఎంతో సంతోషించిన పూజిత పొన్నాడకు చివరకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ వ్యవహారంపై ‘ఆదర్శ కుటుంబం’ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email