movies

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి దుర్గ తేజ్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్? ఇంతకీ అమ్మాయి ఎవరంటే?

3/11/2026

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి దుర్గ తేజ్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్? ఇంతకీ అమ్మాయి ఎవరంటే?

మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయా? సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారా? అధికారిక సమాచారం అయితే లేదు. కానీ..ప్రస్తుతం టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన వార్తలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. నవంబర్ 5న నిశ్చితార్థం జరగనుందని, డిసెంబర్‌లో పెళ్లి ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతకీ సాయి దుర్గ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆమె సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనా? అనేది ఆసక్తికరంగా మారింది.

సాయి దుర్గ తేజ్ పెళ్లి గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన తేదీ కూడా బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. నవంబర్ 5న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరగనుందని సమాచారం. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులంతా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లి కూడా డిసెంబర్‌లోనే జరగనుందని తెలుస్తోంది. డిసెంబర్ 10న హైదరాబాద్‌లో వివాహ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తేదీలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇంత‌కీ అమ్మాయి ఎవరు?

ప్రస్తుతం అందరిలోనూ ఉన్న ప్రధాన ప్రశ్న ఇదే. సాయి దుర్గ తేజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం. అయితే స‌మాచారం మేర‌కు ఆమె సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కాదని, చిన్ననాటి స్నేహితురాలినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరికొన్ని కథనాల్లో ఆమె పేరు కిరణ్మయి అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వివరాలేవీ అధికారికంగా క‌న్‌ఫ‌ర్మ్ కాలేదు. గతంలోనూ సాయి దుర్గ తేజ్ పెళ్లి గురించి పలుమార్లు వార్తలు వచ్చాయి. ఓ హీరోయిన్‌తో ఆయన పెళ్లి జరగబోతుందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. దీంతో ఈసారి వినిపిస్తున్న వార్తలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే నిశ్చితార్థం, పెళ్లి తేదీలతో పాటు కాబోయే వధువు వివరాలపై కూడా సాయి దుర్గ తేజ్ కానీ, మెగా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి నవంబర్ 5న నిజంగానే ఎంగేజ్‌మెంట్ జరగబోతుందా? సాయి దుర్గ తేజ్ జీవిత భాగస్వామి ఎవరు? ఈ ఉత్కంఠకు మెగా ఫ్యామిలీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email