రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి..
16/11/2026

దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించి ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి కబురు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
శ్రీహరి, నటి డిస్కో శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి కాగా, చిన్న కుమారుడు మేఘాంశ్ శ్రీహరి. వీరిలో మేఘాంశ్ ఇప్పటికే హీరోగా సినిమాలు చేస్తూ తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శశాంక్ మాత్రం వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వివాహానికి సిద్ధమవుతున్నారనే వార్త బయటకు వచ్చింది. శశాంక్ వివాహం సంజన అనే యువతితో నిశ్చయమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె కుటుంబం శ్రీహరి కుటుంబానికి చాలాకాలంగా పరిచయమున్న స్నేహితుల కుటుంబమని సమాచారం. ఇరు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యంతో పెద్దలు ఈ సంబంధాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
శశాంక్, సంజనల ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ముహూర్తం కూడా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2027 ఫిబ్రవరి 20న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుక తర్వాత వివాహ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
