బాలయ్య సరసన మరోసారి బాలీవుడ్ హీరోయిన్!
16/11/2026

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న దాదా సినిమాపై రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ నటించబోతున్నారనే ప్రచారం కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలకృష్ణతో గతంలో విద్యాబాలన్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె బసవతారకం పాత్రలో కనిపించి మెప్పించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో బాలయ్యకు జోడీగా నటించి తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే విద్యాబాలన్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతున్నారా? లేక కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ప్రత్యేక పాత్రలో నటించబోతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తాజా ప్రచారం ప్రకారం ఆమెది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న ప్రత్యేక పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాలో ఇప్పటికే కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బాలయ్యతో ఆమె గతంలో భగవంత్ కేసరిలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి జోడీ కడుతున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
