ott

ఓటీటీలోకి వెంకీ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

22/11/2026

ఓటీటీలోకి వెంకీ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’. థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విశేషమేమిటంటే.. థియేటర్లలోకి వచ్చిన నెల రోజులు కూడా పూర్తికాకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నవంబర్ 27 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియెన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నివేదా పేతురాజ్, నారా రోహిత్, డింపుల్ హయతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.

కుటుంబంలోని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. థియేటర్లలో సినిమా చూసే అవకాశం రాని వారితో పాటు మరోసారి చూడాలనుకునే ప్రేక్షకులకు ఓటీటీ రిలీజ్ మంచి అవకాశం కానుంది. మొత్తానికి వెంకటేష్ సినిమా ఇంత త్వరగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఓటీటీలో ‘ఆదర్శ కుటుంబం’ ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందో చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email