movies

ప్రీ థియేట్రికల్ బిజినెస్‌లో ‘వారణాసి’ సెన్సేషన్..

14/11/2026

ప్రీ థియేట్రికల్ బిజినెస్‌లో ‘వారణాసి’ సెన్సేషన్..

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో జరిగే థియేట్రికల్ బిజినెస్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రాల జాబితాలో రాజమౌళి తెరకెక్కించిన RRR అగ్రస్థానంలో కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో RRR సినిమా సుమారు రూ.225 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, పుష్ప 2 చిత్రం రూ.200-220 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసింది. ఇక ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ రూ.168 కోట్లు, సలార్ రూ.160 కోట్లు, బాహుబలి 2 రూ.122 కోట్లు, దేవర రూ.120 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

‘వారణాసి’ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.290 కోట్లకు అమ్ముడైడయ్యాయని సినీ సర్కిల్స్ సమాచారం. అదే నిజమైతే RRR పేరిట ఉన్న రూ.225 కోట్ల థియేట్రికల్ బిజినెస్ రికార్డును వారణాసి ఏకంగా రూ.65 కోట్ల తేడాతో అధిగమించినట్లవుతుంది. అయితే రూ.290 కోట్ల భారీ ధరకు హక్కులు అమ్ముడైతే, ఆ మొత్తాన్ని రికవరీ చేయడం కూడా అంత సులభమైన విషయం కాదు. ట్రేడ్ అంచనాల ప్రకారం బయ్యర్లు లాభాల బాట పట్టాలంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే RRR తెలుగు రాష్ట్రాల్లో సాధించిన సుమారు రూ.430 కోట్ల గ్రాస్ రికార్డ్‌ను వార‌ణాసి క్రాస్ చేస్తుందన‌టంలో సందేహం లేదు.

ప్ర‌స్తుతం ప్రీ థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా వారణాసి ముందు ఇప్పుడు రెండు భారీ లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా నిలవడం.. రెండోది అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా RRR రికార్డును అధిగమించడం. మహేష్ బాబు స్టార్‌డమ్‌కు రాజమౌళి బ్రాండ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email