movies

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. RC17లో చెర్రీ కోసం సుక్కు మాస్టర్ ప్లాన్

5/11/2026

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. RC17లో చెర్రీ కోసం సుక్కు మాస్టర్ ప్లాన్

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి చేతులు కలిపారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్‌ను RC17తో రిపీట్ చేసేందుకు ఈ క్రేజీ కాంబో రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..

‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబు పాత్ర కోసం రామ్ చరణ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. వినికిడి లోపం ఉన్న యువకుడిగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఆ పాత్రలో చరణ్ చూపించిన పెర్ఫార్మెన్స్ ఆయన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు సుకుమార్ మరోసారి అలాంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో చరణ్‌ను ప్రజెంట్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.సమాచారం మేరకు.. ఈ సినిమాలో రామ్ చరణ్ కరాటే తెలిసిన యువకుడిగా కనిపించబోతున్నాడట. అంతేకాదు, ఈ సినిమాలో ఆయన రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. అందులో ఒకటి కరాటే ఫైటర్ పాత్ర కాగా, మరో పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ఇప్పటికే ‘పెద్ది’ సినిమాలో కుస్తీ నేపథ్యంతో కూడిన పాత్రలో కనిపిస్తూ చరణ్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు కరాటే ఫైటర్‌గా కనిపించబోతున్నాడనే వార్త మెగా అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే చరణ్ నుంచి మరో సరికొత్త మాస్ అవతార్ చూడబోతున్నామనుకోవచ్చు.

సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ డెప్త్ ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబును డిజైన్ చేసిన విధానం అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఈసారి చరణ్‌ను ఎలాంటి షేడ్స్‌లో చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ కాంబో.. ఈసారి ఎలాంటి కొత్త ప్రపంచాన్ని చూపించబోతోందో చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email