movies

సూర్య రికార్డ్‌.. హ్యాట్రిక్ హిట్ దక్కేనా!

5/11/2026

సూర్య రికార్డ్‌.. హ్యాట్రిక్ హిట్ దక్కేనా!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు 2026 సంవత్సరం బాగా కలిసొస్తోంది. గత కొంతకాలంగా సరైన బాక్సాఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ ఏడాది వరుస విజయాలు దక్కాయి. ఒకదానికి మరొకటి సంబంధం లేని రెండు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు మరో సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమానే ‘సీన్’.ఈ సినిమా న‌వంబ‌ర్ 6న రిలీజ్ కానుంది.

2026 మొద‌ట్లో సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ సినిమాతో సూర్య భారీ విజయాన్ని అందుకున్నారు. ఫాంటసీ, యాక్షన్, సోషల్ మెసేజ్ కలగలిపిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు సాధించి సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సూర్య పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు లేకపోయినా.. ఎమోషన్స్, కామెడీ, డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇప్పుడు సూర్య నటిస్తున్న మూడో సినిమా ‘సీన్’. మలయాళంలో ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నజ్రియా నజీమ్, నాస్లెన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓ కోల్డ్ కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చే పోలీస్ అధికారి, ఆ కేసు పరిష్కారం కోసం ఆయన ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. యాక్షన్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది.

‘కరుప్పు’తో మాస్ ప్రేక్షకులను, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన సూర్య.. ఇప్పుడు ‘సీన్’తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మలయాళంలో తనదైన స్టైల్‌తో సినిమాలు తీసే జీతూ మాధవన్, సూర్యను ఎలా ప్రజెంట్ చేశారన్నది కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే వరుసగా రెండు విజయాలు అందుకున్న సూర్యకు ఈ సినిమా కూడా హిట్ అయితే 2026లో హ్యాట్రిక్ విజయాలు ఖాతాలో వేసుకున్నట్లే. మరి సూర్య విజయాల జోరు ‘సీన్’తోనూ కొనసాగుతుందా? బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చాటుతారా? అనేది చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email