movies

‘రోలెక్స్’ గురించి సూర్య అప్‌డేట్‌.. లోకేష్ క‌న‌క‌రాజ్‌దే ఆల‌స్య‌మా!

3/11/2026

X.com
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఆయన.. మరోసారి ఆ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలకు తాజాగా మరింత బలం చేకూరింది. రోలెక్స్ స్పిన్‌ఆఫ్ సినిమా గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చర్చలు జరుగుతున్నాయని సూర్య వెల్లడించారు. అంతేకాదు.. ఈసారి హీరోగా కాకుండా విలన్‌గా చేయడానికి సిద్ధమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లోకేష్‌కు ఫోన్ చేయమని చెప్పండి..

సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ తెలుగు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సూర్యను అభిమానులు రోలెక్స్ సినిమా గురించి ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందిస్తూ.. రోలెక్స్ సినిమాకు సంబంధించి తెరవెనుక కొన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు తనకు ఫోన్ చేయమని, వచ్చి కలవమని చెప్పాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కచ్చితంగా ఆ ప్రాజెక్టును నిజం చేద్దామని అన్నారు.

అంతేకాదు.. హీరోగా చేయాలా? విలన్‌గా చేయాలా? అని అభిమానులను అడిగారు. అందుకు అభిమానులంతా విలన్ అంటూ కేకలు వేశారు. దీనిపై సూర్య స్పందిస్తూ.. ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చేశారని, ఇప్పుడు ఒక బలమైన విలన్ అవసరమని అన్నారు. దీంతో రోలెక్స్ పాత్ర మరోసారి వెండితెరపై కనిపించబోతుందనే ఆశలు అభిమానుల్లో పెరిగాయి.

విక్రమ్‌లో కొద్దిసేపే కనిపించినా..

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్రను సూర్య పోషించారు. సినిమా చివర్లో కొద్దిసేపు మాత్రమే కనిపించినప్పటికీ.. తన భయంకరమైన గెటప్, నటన, డైలాగ్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌తో రోలెక్స్ నేపథ్యంలో ప్రత్యేకంగా ఓ సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు సూర్య చేసిన వ్యాఖ్యలు ఆ అంచనాలను మరింత పెంచాయి.

మొత్తానికి రోలెక్స్ పాత్ర గురించి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? లోకేష్ కనగరాజ్ ఎప్పుడు పూర్తి స్క్రిప్ట్‌తో ముందుకొస్తారు? అనేది తెలియాల్సి ఉంది. రోలెక్స్‌గా సూర్య మరోసారి వెండితెరపై కనిపిస్తే మాత్రం అభిమానులకు పండగే!

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email