సూర్య, ధనుష్ కాంబోలో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్!
9/11/2026

కోలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందా? స్టార్ హీరోలు సూర్య, ధనుష్ ఒకే సినిమాలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించేందుకు స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రయత్నిస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే కోలీవుడ్‌లో ఇది మరో రేర్ కాంబినేషన్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందనటంలో సందేహం లేదు.
డిఫరెంట్ స్టోరీస్, రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య. ఈ ఏడాది ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, సీన్ చిత్రాలో చిత్రాలతో విజయాలు అందుకున్నారు. మరోవైపు ధనుష్ కూడా తనదైన స్టైల్లో వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యమిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ఓమ్: చాప్టర్ 1 – ఉదిరం’ నవంబర్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మణిరత్నం తన నెక్ట్స్ సినిమా కోసం సూర్య, ధనుష్‌లను సంప్రదించినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు స్టార్ హీరోస్ ఇమేజ్‌కు సరిపోయేలా మణిరత్నం కథను సిద్ధం చేసినట్లు టాక్. కథా చర్చలు కూడా జరిగినట్లు, హీరోల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మణిరత్నం ‘ఇంజి వెల్లం’ (తెలుగు అర్థం అల్లం బెల్లం) సినిమాతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పనులు పూర్తయిన తర్వాతే ఆయన తదుపరి ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు సూర్య, ధనుష్ కాంబినేషన్‌పై కానీ.. మణిరత్నం దర్శకత్వంపై కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్తలు నిజమై ప్రాజెక్టు పట్టాలెక్కితే మాత్రం కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్స్‌పైకి వెళ్తుందా? అనేది వేచి చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
