Siddhu Jonnalagadda Tries Something Different… Will He Finally Taste Success This Time?
10/11/2026

సిద్ధు జొన్నలగడ్డ డిఫరెంట్ అటెంప్ట్.. ఈసారైనా సక్సెస్ దక్కేనా!
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. అయితే టిల్లు ఫ్రాంచైజీ మిహాయించి.. బయట ఆయన చేసిన సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో సిద్ధు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలను పక్కన పెట్టి, కథల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో ‘లుంగిమాన్’ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు సిద్ధు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సిద్ధు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. బాబీ అనే కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మూడు భారీ షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
మొత్తానికి టిల్లు ఇమేజ్ను పక్కన పెట్టి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధు ప్రయత్నిస్తున్నారు. మరి కొత్త దర్శకుడు బాబీతో ఆయన చేయబోయే ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
