రేర్ రికార్డ్‌పై గురి పెట్టిన శర్వానంద్!
15/11/2026

టాలీవుడ్లో వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు హీరో శర్వానంద్. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. మరో రెండు చిత్రాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నట్టుగా ఈ సినిమాలు విడుదలైతే ఏడాది వ్యవధిలో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోగా శర్వానంద్ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. అదేంటంటే ఏడాదిలో నాలుగు సినిమాలను రిలీజ్ చేయటానికి సిద్ధమయ్యారు. 2026 త్వరలోనే కంప్లీట్ కానుంది కదా.. ఇప్పటి వరకు రెండు సినిమాలే వచ్చాయి.. మరో సినిమా భోగి డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్సులున్నాయి. అలాగే జరిగితే ఈ ఏడాదిలో మూడు సినిమాలే రిలీజ్ అవుతాయిగా..అనుకోవచ్చు. కానీ.. అసలు విషయమేమంటే వివరాల్లోకెళ్తే..
ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు విడుదల చేయడం సాధారణ విషయమే. కానీ ఇప్పుడు సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ఏడాదికి ఒక్క సినిమా విడుదల చేయడం కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదల తేదీలు వాయిదా పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ హీరో శర్వానంద్ మాత్రం వరుస సినిమాలతో తన స్పీడ్ చూపిస్తున్నారు.
2026 జనవరి 14న ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్.. ఆ తర్వాత ‘బైకర్’ చిత్రంతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు ‘భోగి’ సినిమాపై దృష్టి పెట్టారు. తొలుత దీపావళికి విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం డిసెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినీ సర్కిల్స్ సమాచారం మేరకు డిసెంబర్లో క్రిస్మస్కు ముందుగానే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు శర్వానంద్ నటిస్తున్న ‘జార్జ్ క్రిష్’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తనదైన కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే శర్వానంద్‌కు ఒక ఆసక్తికరమైన రికార్డు ఎదురుచూస్తోంది. 2026 జనవరి 14న విడుదలైన ‘నారి నారి నడుమ మురారి’ నుంచి 2027 జనవరి 14న విడుదల కానున్న ‘జార్జ్ క్రిష్’ వరకు లెక్కిస్తే.. సరిగ్గా ఏడాది వ్యవధిలో ఆయన నటించిన నాలుగు సినిమాలు విడుదలైనట్లవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధారణ విషయం కాదు. మరి అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ సినిమాలను రిలీజ్ చేసి అరుదైన రికార్డ్‌ను శర్వానంద్ సాధిస్తారో లేదో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
