ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్.. డిసెంబర్ 4న థియేటర్లలోకి సల్మాన్ ఖాన్ మాతృభూమి!
19/11/2026

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ ఎట్టకేలకు సెన్సార్ అడ్డంకులను దాటింది. మొదట బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే టైటిల్‌తో ప్రచారంలోకి వచ్చిన ఈ సినిమా, ఆ తర్వాత మాతృభూమిగా పేరు మార్చుకుంది. 2020లో భారత్, చైనా సైనికుల మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. దేశభక్తి, సైనికుల పోరాటం లాంటి అంశాలను ప్రధానంగా తీసుకున్న ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కథాంశం, కొన్ని సన్నివేశాలు, కారణంగా సినిమా ప్రయాణం అనుకున్నంత ఈజీగా సాగలేదు. దీంతో విడుదల తేదీ కూడా మారుతూ వచ్చింది.
తాజాగా నవంబర్ 18న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ మూవీకి యూ/ఏ 16+ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాదు, ఎలాంటి కట్స్ లేకుండానే సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం విశేషం. సెన్సార్ వివరాల ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాల 12 సెకన్లు. గతంలో ఈ సినిమా సెన్సార్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కథలో మార్పులు చేయాల్సి వస్తోందని రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే నవంబర్ 6న జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ఈ ప్రచారాన్ని ఖండించారు. సెన్సార్ బోర్డు సినిమా చూసిన తర్వాత ఎలాంటి కట్స్ లేకుండానే క్లియరెన్స్ వచ్చిందని ఆయన వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా చుట్టూ తిరిగిన సెన్సార్ వివాదాలకు ఒకరకంగా తెరపడినట్లయింది.
ఈ సినిమా ఆలస్యానికి సెన్సార్ ఒక్కటే కారణం కాదని తెలుస్తోంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయాల్సి రావడం, కథానాయిక చిత్రాంగదా సింగ్‌కు గాయం కావడం వంటి కారణాలు కూడా షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం చూపించాయి. విజువల్స్ విషయంలో రాజీ పడకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే కొంత సమయం తీసుకున్నామని సల్మాన్ గతంలోనే చెప్పారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌తో పాటు చిత్రాంగదా సింగ్ కీలక పాత్రలో నటించారు. హిమేశ్ రేషమ్మియా సంగీతం అందించారు. నవంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేయనుంది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
