ప్లీజ్ సినిమాలు వదిలేయకండి..ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్ !
16/11/2026

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారా? ఇప్పటికే దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమైన నేపథ్యంలో ఇప్పుడు ధనుష్ విషయంలోనూ ఇలాంటి ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా నటి సాయి పల్లవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ధనుష్‌కు స్టేజ్‌పైనే ఓ ఎమోషనల్ రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన ఓం: చాప్టర్ 1 – ఉదిరమ్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి పల్లవి మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈవెంట్‌కు వస్తున్న సమయంలో రోడ్ల వెంట ధనుష్ అభిమానుల జెండాలు కనిపించాయని, అక్కడి వాతావరణం చూస్తుంటే సినిమా వేడుక కంటే రాజకీయ సభను తలపించిందని ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. అలాగే తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పిన సాయి పల్లవి.. ఒక నటిగా మాత్రం ఆయనకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపింది. ఇప్పటికే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యారని, ధనుష్ కూడా అదే బాటలో నడిస్తే ప్రేక్షకులు మరో గొప్ప నటుడిని మిస్ అవుతారని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
ధనుష్ లాంటి సహజమైన నటులు, రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఆర్టిస్టులు ఇండస్ట్రీకి చాలా అవసరమని సాయి పల్లవి పేర్కొంది. ఆయన సినిమాల్లో చూపించే పాత్రలు, కథలు ప్రేక్షకులపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తాయని గుర్తుచేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నటనను మాత్రం కొనసాగించాలని కోరింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. మరి సాయి పల్లవి చేసిన ఈ ఎమోషనల్ రిక్వెస్ట్‌ను ధనుష్ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాడు? రాజకీయాల్లోకి వచ్చినా సినిమాల్లోనూ కొనసాగుతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
