ఘనంగా సాయిదుర్గతేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే!
6/11/2026

హైదరాబాద్‌లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో సాయి దుర్గ తేజ్, కిరణ్‌ల నిశ్చితార్థ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన సభ్యులతో పాటు బంధుమిత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు నిర్మల, అల్లు బాబీ, నీలాశా, నాగబాబు, పద్మజ, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల తదితరులు హాజరయ్యారు. అలాగే వైష్ణవ్ తేజ్, అకిరా నందన్, ఆద్య కూడా ఈ వేడుకలో సందడి చేశారు.
కుటుంబ సభ్యులతో పాటు సాయి దుర్గ తేజ్‌కు సన్నిహితులైన పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మంచు మనోజ్, భూమా మౌనిక, నవదీప్, హర్ష చెముడు, వెంకీ కుడుముల, నవీన్ విజయకృష్ణ, హర్షిత్ రెడ్డి తదితరులు హాజరై జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ సాయి దుర్గ తేజ్, కిరణ్‌లకు అభినందనలు తెలిపారు. వారి జీవితం ప్రేమానురాగాలతో, సంతోషంతో సాగాలని ఆకాంక్షించారు. దీంతో ఈ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
