జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్.. కొత్త 007 ముందున్న సవాల్లేంటి?
17/11/2026

జేమ్స్ బాండ్ సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. యాక్షన్, స్టైలిష్ లుక్స్, గ్యాడ్జెట్స్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఈ ఫ్రాంచైజీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే డేనియల్ క్రెయిగ్ తర్వాత బాండ్‌గా ఎవరు కనిపిస్తారనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్‌గా ఎంపికయ్యారు. నవంబర్ 16న అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో చాలా రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. డేనియల్ క్రెయిగ్ తర్వాత ఏడో జేమ్స్ బాండ్‌గా ప్యాటిన్సన్ బాధ్యతలు తీసుకోనున్నారు.
రాబర్ట్ ప్యాటిన్సన్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ట్విలైట్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత గుడ్ టైమ్, ది లైట్‌హౌస్, టెనెట్, మిక్కీ 17 లాంటి సినిమాలతో తనలోని నటుడిని మరో కోణంలో చూపించారు. ఇక ది బ్యాట్మ్యాన్తో సూపర్ హీరో ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు జేమ్స్ బాండ్‌గా ఎంపిక కావడం ఆయన కెరీర్లో మరో కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకవైపు బ్యాట్‌మ్యాన్‌గా, మరోవైపు 007గా రెండు ప్రతిష్టాత్మక పాత్రలను ఆయన కంటిన్యూ చేయాల్సి్ ఉంది.
ఈ కొత్త బాండ్ సినిమాకు డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహించనున్నారు. పీకీ బ్లైండర్స్ సృష్టికర్త స్టీవెన్ నైట్ కథ అందిస్తున్నారు. అమీ పాస్కల్, డేవిడ్ హేమన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే జేమ్స్ బాండ్ పాత్రకు కేవలం స్టైలిష్ లుక్ ఉంటే సరిపోదు. యాక్షన్‌తో పాటు ఇంటెలిజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ డెప్త్ కూడా అవసరం. డేనియల్ క్రెయిగ్ తనదైన శైలిలో ఈ పాత్రకు కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్యాటిన్సన్ ఆ స్థాయిని అందుకోవడమే కాకుండా తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది.
మరోవైపు అమెజాన్ చేతుల్లోకి ఫ్రాంచైజీ వెళ్లిన తర్వాత వస్తున్న తొలి బాండ్ సినిమా కావడంతో ఈ చిత్రానికి మరింత ఇంపార్టెన్స్ ఉంది. పాత బాండ్ అభిమానులను సంతృప్తిపరుస్తూనే కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం దర్శకుడికి పెద్ద సవాలే. ప్యాటిన్సన్ ఎంపికతో ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగినా, ఆయనను బాండ్‌గా అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది. మరి డేనియల్ క్రెయిగ్ సృష్టించిన ఇంపాక్ట్‌ను రాబర్ట్ ప్యాటిన్సన్ కొనసాగిస్తారా? లేక 007 పాత్రకు పూర్తిగా కొత్త నిర్వచనం ఇస్తారా? అన్నది చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
