movies

రష్మిక ‘మైసా’విడుదల మళ్లీ వాయిదా !

22/11/2026

రష్మిక ‘మైసా’విడుదల మళ్లీ వాయిదా !

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ విడుదల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మారుస్తూ చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

తెలుగు సినిమా స్థాయి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ‘మైసా’ను కూడా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నామని తెలిపారు. తాము అనుకున్న స్థాయిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో నవంబర్ 27 విడుదలను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని టీమ్ తెలియ‌జేసింది. అప్పటివరకు సినిమాలోని పవర్‌ఫుల్ సాంగ్ ‘ఓసే రాములమ్మ’ను ఆస్వాదిస్తూ తమకు మద్దతుగా నిలవాలని అభిమానులను కోరింది.

దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు గ్లామర్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రల్లో మెప్పించిన ఈ బ్యూటీ.. ఈసారి రఫ్ అండ్ రస్టిక్ యాక్షన్ అవతార్‌లో అలరించేందుకు సిద్ధమవుతోంది. మొత్తానికి రష్మిక అభిమానులు నవంబర్ 27న ‘మైసా’ను థియేటర్లలో చూడాలనుకున్నప్పటికీ, విడుదల వాయిదా పడటంతో కొంత నిరాశ తప్పలేదు. అయితే మేకర్స్ చెబుతున్నట్లుగా భారీ స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందిస్తే ఈ ఆలస్యం సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email