movies

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసల వర్షం.. రణ్‌బీర్, యశ్ నటనకు ఫిదా!

6/11/2026

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసల వర్షం.. రణ్‌బీర్, యశ్ నటనకు ఫిదా!

Source: X.com
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా తెరకెక్కిన ‘రామాయణ’ దీపావళి సందర్భంగా నవంబర్5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ విజువల్ ఎపిక్‌పై రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాను వీక్షించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా తెరకెక్కించిన విధానంతో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

‘రామాయణ’ సినిమా భారీ స్థాయి, వెండితెరపై ఆవిష్కరించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని రాజమౌళి కొనియాడారు. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటన తనను ఆకట్టుకుందని తెలిపారు. వనవాసం తర్వాత వచ్చే సన్నివేశాల్లో రణ్‌బీర్ ఎంతో ప్రశాంతంగా, అదే సమయంలో గంభీరంగా కనిపించారని ప్రశంసించారు. ఇక రావణుడి పాత్రలో యశ్ తనదైన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారని రాజమౌళి పేర్కొన్నారు. సీత పాత్రలో సాయి పల్లవి ఎంతో హుందాగా, అందంగా ఒదిగిపోయారని అభినందించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు తనకు బాగా నచ్చాయని, సినిమాలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించానని వెల్లడించారు.

ఇంతటి భారీ ప్రాజెక్టును ఎంతో అందంగా తెరపైకి తీసుకొచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీతో పాటు చిత్రబృందం మొత్తానికి రాజమౌళి అభినందనలు తెలిపారు. ఆయన ప్రశంసలతో ‘రామాయణ’ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందించడం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. రామాయ‌ణ రెండో భాగం వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా సత్తా చాటిన రాజమౌళి నుంచి ప్రశంసలు రావడం ‘రామాయణ’ చిత్రబృందానికి మంచి ప్రోత్సాహమనే చెప్పాలి

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email