థియేటర్లలో మెప్పించిన ‘ప్రేమద ఊరలి’.. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలో!
17/11/2026

పెద్దగా హడావుడి లేకుండా విడుదలై, ప్రేక్షకుల ఆదరణతో నిలదొక్కుకున్న కన్నడ సినిమా ‘ప్రేమద ఊరలి’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడలేకపోయినవారు ఇప్పుడు ఇంట్లోనే తమకు నచ్చిన భాషలో చూసేయొచ్చు.
మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయణ రఘు, శ్రీరామ్, తపస్విని పూనాచా, రమికా శివు ప్రధాన పాత్రలు పోషించారు. మొదట పరిమిత ప్రదర్శనలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో క్రమంగా షోలు పెరిగాయి. అలా థియేటర్లలో 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుని ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇంతకీ కథేంటి?
ఓ పల్లెటూరి రైతు కుటుంబం చుట్టూ కథ నడుస్తుంది. తన కొడుక్కి బాగా చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనేది తండ్రి కోరిక. అయితే కొడుకు జీవితంలో ఉన్న అనుబంధాలు, తండ్రి చూసిన సంబంధం కారణంగా కొన్ని చిక్కులు ఎదురవుతాయి. వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? తండ్రీకొడుకుల మధ్య ఏం జరిగింది? అన్నది తెరపైనే చూడాలి.
ప్రేమకథతో పాటు కుటుంబ బంధాలు, పెళ్లిపై పెద్దల ఆశలు, పిల్లల ఇష్టాలను పల్లెటూరి నేపథ్యంలో చూపించారు. తండ్రిగా రంగాయణ రఘు, కొడుకుగా శ్రీరామ్ నటించారు. పల్లెటూరి కథలు, కుటుంబ భావోద్వేగాలు ఉన్న సినిమాలు చూడాలనుకునేవారికి ‘ప్రేమద ఊరలి’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
