movies

Pawan Kalyan and Anna Konidela announce their divorce

10/11/2026

Pawan Kalyan and Anna Konidela announce their divorce

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ కీలక వార్త వెలుగులోకి వచ్చింది. పవన్ కల్యాణ్, అనా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫ్యాన్స్‌కి మాత్రం ఉహించ‌ని షాక్ అనే చెప్పాలి.

సోమవారం రాత్రి విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పవన్, అన్నా పేర్కొన్నారు. ఈ నిర్ణయం పరస్పర అవగాహన, గౌరవంతో తీసుకున్నదని స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. తమ పిల్లల సంతోషం, భవిష్యత్తు, సంక్షేమమే ఇద్దరికీ ముఖ్యమని, తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను కొనసాగిస్తామని వెల్లడించారు.

పవన్ కల్యాణ్, అనా కొణిదెల 2013లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ఇప్పుడు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. తమ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఈ మార్పును అందరూ అర్థం చేసుకోవాలని, ఈ సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email