No Plans to Enter Politics – Suriya Sets the Record Straight!
10/11/2026

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు – క్లారిటీ ఇచ్చిన సూర్య!
తమిళ సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. గతంలో ఎంజీఆర్ నుంచి కమల్ హాసన్ వరకు ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాజాగా దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. దీంతో మరో స్టార్ హీరో సూర్య కూడా పాలిటిక్స్‌లోకి వస్తారా? అనే చర్చ మొదలైంది. అయితే ఈ ఊహాగానాలకు సూర్య చెక్ పెట్టేశారు.
తన కొత్త సినిమా సీన్ ప్రమోషన్లలో పాల్గొన్న సూర్య రాజకీయాల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కుండ బద్దలు కొట్టేశారు. అయితే రాజకీయాలంటే తనకు ద్వేషం లేదని, వాటిని చాలా దగ్గరగా గమనిస్తున్నానని చెప్పారు. ''నేను రాజకీయాల్లోకి రావడం లేదు. అంతమాత్రాన నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని కాదు. రాజకీయాలను నిశ్శబ్దంగా, చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను'' అంటూ తన పొలిటికల్ వ్యూస్ గురించి క్లారిటీ ఇచ్చారు.
ఇక సమాజంలో ఉన్న అవినీతి గురించి కూడా సూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని ఎవరో మూడో వ్యక్తి వచ్చి నిర్మూలించలేరని, పూర్తి అంకితభావంతో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని అన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే వ్యక్తిగత ఎవరికి వారు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉండటం ఎంతో అవసరమన్నారు సూర్య.
అయితే సూర్య పాలిటిక్స్ విషయంలో చేసిన ఓ కామెంట్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''నాకు సరైన దారి తెలియకపోయినా రాజకీయాల్లోకి మాత్రం రాను'' అంటూ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేశారు నడిప్పిన్ నాయగన్. దీంతో విజయ్ బాటలో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలకు తెరపడినట్టయింది.
మరోవైపు సూర్య రాజకీయాల్లోకి వెళ్లకుండా సినిమాలపైనే దృష్టి పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న సూర్య, రాజకీయాల కంటే నటనకే ప్రాధాన్యత ఇవ్వటం బెటర్ అని భావిస్తున్నారు అభిమానులు. మొత్తానికి విజయ్, కమల్ హాసన్ లాంటి నటులు రాజకీయాల వైపు అడుగులు వేస్తుంటే.. సూర్య మాత్రం ఆ దారిలో వెళ్లే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
