నిర్మాతలకు నిధి అగర్వాల్ షాక్..ఆగిపోయిన ‘తంత్ర 2’ షూటింగ్
11/11/2026

నిర్మాతలకు నిధి అగర్వాల్ షాక్..ఆగిపోయిన ‘తంత్ర 2’ షూటింగ్
హీరోయిన్ నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమెకు సంబంధించిన వార్తలు సినిమా విజయాల గురించి కాదు.. ఓ సినిమా షూటింగ్‌లో ఆమె వ్యవహరించిన తీరుపై వస్తున్న ఆరోపణల గురించి. నిధి అగర్వాల్ ప్రవర్తన కారణంగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె తీరుతో చిత్రబృందం అసంతృప్తికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిధి అగర్వాల్ ‘తంత్ర 2’ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కు ఆమె సరిగ్గా హాజరుకాకపోవడంతో చిత్రీకరణ నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కోసం ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్‌కు అంతరాయం కలగడంతో చిత్ర యూనిట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. నిధి వ్యవహారశైలిపై చిత్రబృందం అసంతృప్తిగా ఉందని, ఆమె తీరుపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై నిధి అగర్వాల్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా విజయం తర్వాత ఆమె కెరీర్ మరింత వేగంగా ముందుకు సాగుతుందని అంతా భావించారు. కానీ ఆ స్థాయిలో వరుస విజయాలను అందుకోలేకపోయారు. ఆమె నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ చిత్రాలు సైతం ఆమె కెరీర్‌కు ఆశించిన స్థాయిలో బూస్ట్ ఇవ్వలేకపోయాయి.
వరుస పరాజయాలు ఎదురవుతున్నప్పటికీ నిధికి సినిమా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మహిళా ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులతో పాటు ‘తంత్ర 2’లోనూ నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో షూటింగ్‌కు సంబంధించిన వివాదాలు తెరపైకి రావడం ఆమె కెరీర్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నాయి సినీ సర్కిల్స్. అయితే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. అసలు విషయం ఏమిటనే దానిపై ఇటు చిత్ర యూనిట్ లేదా అటు మేకర్స్ రియాక్ట్ కావాల్సి ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
