రొటీన్‌కు భిన్నంగా నయనతార ప్రత్యేక పూజలు.. చీరల పంపిణీని చేసిన స్టార్ హీరోయిన్
4/11/2026

లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాశక్తి’) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు ఆమె చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చెన్నైలోని ప్రముఖ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా.. భక్తులకు చీరలను పంపిణీ చేసి తన భక్తిని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
నయనతార చెన్నైలోని ప్రసిద్ధ కాళికా అంబాల్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా ముదురు నీలం రంగు చీర ధరించి, జడలో పూలు అలంకరించుకుని ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు చీరలను పంపిణీ చేశారు. నయనతార ఆలయానికి రావడంతో అక్కడి భక్తులు, అభిమానుల దృష్టి ఆమెపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 6న రిలీజ్‌కు...
నయనతార నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. 2020లో విడుదలై విజయవంతమైన ‘మూకుత్తి అమ్మన్’ చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగంలో అమ్మవారి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార.. రెండో భాగంలోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఈ మూవీని మహాశక్తి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా మహాశక్తి సినిమా విడుదలకు ముందు నయనతార ఆలయాన్ని సందర్శించడం, భక్తులకు చీరలు పంపిణీ చేయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అమ్మవారి పాత్రలో మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్న నయనతార.. సినిమా విడుదలకు ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం విశేషంగా నిలిచింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
