నాని ‘బ్లడీ రోమియో’కు లీకుల బెడద.. !
3/11/2026
టాలీవుడ్లో మరోసారి సినిమా లీకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ చిత్రబృందాలకు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’కు కూడా ఈ లీకుల బెడద తప్పలేదు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో చిత్రబృందం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో నాని షూటింగ్.. వీడియోలు వైరల్!
‘ది ప్యారడైజ్’ సినిమా తర్వాత నాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘సాహో’, ‘ఓజీ’ వంటి సినిమాలతో స్టైలిష్ యాక్షన్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ చేస్తుండటంతో స్థానికులు తమ ఫోన్లలో నాని లుక్, గెటప్‌కు సంబంధించిన దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కీలక సన్నివేశాలను కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారుతున్నాయి.
సర్ప్రైజ్లు ముందే లీక్!
ఈ సినిమాలో నాని ఎలా కనిపించబోతున్నారు? ఆయన పాత్ర స్వభావం ఏమిటి? అనే అంశాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టైటిల్ గ్లింప్స్‌లో నాని చెఫ్‌గానే కాకుండా గ్యాంగ్‌స్టర్ అవతారంలోనూ కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా కోసం సుజీత్ ఎలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టించారనే ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పుడు షూటింగ్ వీడియోలు బయటకు రావడంతో నాని లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్‌కు సంబంధించిన విషయాలు ముందుగానే ప్రేక్షకులకు తెలిసిపోతున్నాయి. దర్శకుడు సినిమాలో ప్రత్యేకంగా ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇలా ముందే బయటకు వస్తే థియేటర్లలో ప్రేక్షకులకు ఉండే ఆసక్తి తగ్గే అవకాశం ఉంది.
2027 సమ్మర్లో విడుదల?
‘బ్లడీ రోమియో’ సినిమాను మేకర్స్ ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే షూటింగ్‌కు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడం చిత్రబృందానికి ఇబ్బందికరంగా మారింది. మరి రాబోయే షెడ్యూల్స్‌లో ఈ లీకులకు అడ్డుకట్ట వేస్తారా? సుజీత్ దాచిపెట్టిన సర్ప్రైజ్లను ప్రేక్షకుల కోసం ఎలా కాపాడుకుంటారో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
