movies

రూమర్స్‌కి నాగ చైతన్య చెక్..‘వృషకర్మ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే!

22/11/2026

రూమర్స్‌కి నాగ చైతన్య చెక్..‘వృషకర్మ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే!

అక్కినేని నాగచైతన్య అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ విడుదల వాయిదా పడుతుందంటూ గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్తలకు చిత్రబృందం ఫుల్‌స్టాప్ పెట్టింది. అనుకున్న తేదీకే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించి అక్కినేని అభిమానుల్లో జోష్ పెంచింది.

‘వృషకర్మ’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాలేదని, అందుకే సినిమా విడుదలను వాయిదా వేసి క్రిస్మస్ బరిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మేకర్స్ తమ తాజా ప్రకటనతో తేల్చేశారు. నవంబర్ 25న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేశారు. చైత‌న్య‌ను ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో చూపించబోతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

‘విరూపాక్ష’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ కథ అందిస్తున్న ఈ చిత్రం పురాతన రహస్యాలు, గుహలు, నిధి అన్వేషణ, మిస్టరీ అంశాల చుట్టూ సాగనున్న మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో నాగచైతన్య ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనున్నట్లు సమాచారం. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు జయరామ్, సత్య, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email