movies

Massive Set Being Built for ‘Fauzi’… Prabhas Makes a Grand Comeback!

10/11/2026

Massive Set Being Built for ‘Fauzi’… Prabhas Makes a Grand Comeback!

‘ఫౌజీ’ కోసం భారీ సెట్.. ప్రభాస్ రీ ఎంట్రీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సినిమాల షూటింగ్స్ విషయంలో మళ్లీ స్పీడ్ పెంచారు. ఇటీవల ఇటలీలో వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన డార్లింగ్.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. తాజాగా ఆయన నటిస్తోన్న భారీ చిత్రం ‘ఫౌజీ’ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా భారీ పెళ్లి సెట్‌ను నిర్మించినట్లు సమాచారం.

ఈ సెట్‌లో ప్రభాస్, హీరోయిన్ ఇమాన్విపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఈ ఏడాది చివరి నాటికి తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 19న ‘ఫౌజీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలనే టార్గెట్‌తో టీమ్ అడుగులేస్తోంది. మరి హను రాఘవపూడి ఈ సినిమాతో ప్రభాస్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ పెళ్లి వేడుక ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌తో అనిరుధ్ ఏడడుగులు వేయబోతున్నారు. ఈ వివాహం కోసం ఇరు కుటుంబాలు గ్రీస్‌కు పయనమవడంతో పెళ్లి సందడి మొదలైపోయింది.

ఇప్పటికే ఈ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది. సాధారణ వివాహ వేడుకలా కాకుండా.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. అందమైన విదేశీ లొకేషన్‌, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కాబోతున్నారు.

ఈ పెళ్లిలో మరో ప్రత్యేక ఆకర్షణ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబం. అనిరుధ్‌కు బంధువైన రజనీకాంత్‌ తన కుటుంబంతో కలిసి గ్రీస్‌కు బయలుదేరారు. మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుటుంబం కూడా వివాహ వేడుకలో పాల్గొనేందుకు గ్రీస్‌ వెళ్లింది. వీరి ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ పెళ్లికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నవంబర్‌ 21న చెన్నైలో గ్రాండ్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.

కావ్య మారన్‌ కుటుంబానికి సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో ఉన్న పరిచయాలు.. అనిరుధ్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఈ వివాహానికి భారీ స్థాయిలో ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే గ్రీస్‌లో జరిగే అసలు వివాహ వేడుకకు హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా, వెడ్డింగ్‌ డెకరేషన్‌, సంగీత్‌, ఇతర వేడుకల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

మొత్తానికి అనిరుధ్‌–కావ్య మారన్‌ పెళ్లి కోలీవుడ్‌లో మరో క్రేజీ సెలబ్రిటీ వెడ్డింగ్‌గా మారబోతోంది. ఒకవైపు రజనీకాంత్‌, స్టాలిన్‌ కుటుంబాల రాక.. మరోవైపు చెన్నైలో జరగనున్న గ్రాండ్‌ రిసెప్షన్‌.. ఈ పెళ్లిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email