movies

*మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌.. అనిల్ రావిపూడి కాంబోలో సినిమా*

14/11/2026

*మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌.. అనిల్ రావిపూడి కాంబోలో సినిమా*

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి మ‌నం చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌వ‌ర‌సాల్లో ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే ఈ స్టార్ హీరో.. ఇప్పుడు కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా పేరున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ ప‌వ‌ర్ ప్యాక్‌డ్ మూవీ చేయ‌టానికి రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ వారి అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌, అనిల్ రావిపూడి క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ కాంబో మూవీకి సంబంధించిన‌ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని టీమ్ తెలియ‌జేసింది.

యాక్ష‌న్‌తోపాటు అదుర్స్ చిత్రంలో త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ఎన్టీఆర్ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అలాంటి పాత్ర‌లో ఆయ‌న న‌టించాల‌ని ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ త‌రుణంలో వీరి క‌ల‌యిలో సినిమా అనౌన్స్ కావ‌టంతో అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email