movies

శర్వానంద్ ‘భోగి’ వాయిదాపై మేకర్స్ క్లారిటీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

12/11/2026

శర్వానంద్ ‘భోగి’ వాయిదాపై మేకర్స్ క్లారిటీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోగి’ రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అప్ప‌టి నుంచి రెండు సార్లు వాయిదా ప‌డ్డా ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే అనూహ్యంగా సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, శర్వానంద్ మాస్ అవతార్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. టీజర్, పాటలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

అయితే తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరోవైపు ఇదే తేదీన మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా ‘ఇడుపు కాయితం’, ‘పాకెట్ రాకెట్స్’ సినిమాలతో పాటు ‘ఇంకా అనుకోలేదు’, ‘రాయవలస’ వంటి చిన్న చిత్రాలు కూడా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. దీంతో శర్వానంద్ ‘భోగి’కి ఒకే రోజు మల్టీపుల్ సినిమాల నుంచి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email