మహేశ్ లెక్కే వేరు.. కొత్త వ్యాపారంలోకి సూపర్‌స్టార్
3/11/2026

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. ముంబయికి చెందిన పార్కింగ్ గేమ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా భాగస్వామి అయ్యారు. దీంతో మహేశ్ బాబు అభిమానుల్లో ఈ వార్త ఆసక్తిని పెంచుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని పీసీ, కన్సోల్ గేమ్స్‌ను రూపొందిస్తున్నట్లు పార్కింగ్ గేమ్స్ సంస్థ వ్యవస్థాపకులు జీత్ చందన్, వివేక్ మెహతా వెల్లడించారు. మహేశ్ బాబు పెట్టుబడుల భాగస్వామ్యంతో ఓ సరికొత్త అడ్వెంచర్ గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ‘టెక్డెన్ జెనెసిస్’ పేరుతో ఈ గేమ్ రూపొందనుంది.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. దేశంలో సృజనాత్మక ప్రతిభకు ఎలాంటి కొదవ లేదని పేర్కొన్నారు. కొత్త రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, గేమింగ్ వంటి విభిన్న రంగాల్లోనూ తన ఆసక్తిని చాటుకుంటున్నారు మహేశ్ బాబు.
ఇప్పటికే సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ బాబు.. ఇప్పుడు గేమింగ్ రంగంలోనూ పెట్టుబడిదారుడిగా అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆయన భాగస్వామ్యంతో రూపొందనున్న కొత్త అడ్వెంచర్ గేమ్ అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
