పెళ్లి కంటే లివ్ ఇన్ రిలేషన్ బెటర్ అనిపించింది.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్!
16/11/2026

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. దర్శకుడు కృష్ణవంశీతో తన వైవాహిక బంధం గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ఆమె.. పెళ్లి కంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కే ఓటు వేయాల్సిందని అప్పుడప్పుడు అనిపిస్తుందని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రమ్యకృష్ణ, కృష్ణవంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుండటంతో విడాకులు తీసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇద్దరూ కలిసి కనిపించకపోవడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ ఈ ప్రచారంపై స్పందిస్తూ తమ బంధం గురించి క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం ప్రస్తుతం రెండు వేర్వేరు నగరాల్లో ఉంటున్నప్పటికీ చాలా సంతోషంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. కలిసి ఉన్నప్పుడు తరచూ గొడవలు పడే బదులు, వేర్వేరుగా ఉంటూ మంచి స్నేహితుల్లా జీవితాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. బహుశా అందుకే ఇప్పటికీ తమ వైవాహిక బంధం ఇంత బలంగా ఉందేమోనని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
అసలు తామిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండటానికి కారణాన్ని కూడా రమ్యకృష్ణ వివరించారు. తన కుమారుడు చిన్నవాడిగా ఉన్న సమయంలో ఆమె చెన్నైలో ఓ టెలివిజన్ సీరియల్లో నటించేవారు. ఆ సమయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ ప్రయాణాల కారణంగా తన కుమారుడికి తరచూ అనారోగ్య సమస్యలు వచ్చేవని తెలిపారు. దీంతో కృష్ణవంశీతో చర్చించి కుమారుడిని చెన్నైలోనే స్కూల్లో చేర్పించి, తాను అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కృష్ణవంశీ మాత్రం తన పని కారణంగా హైదరాబాద్‌లోనే ఉండిపోయారని వెల్లడించారు.
ఇక పెళ్లి వ్యవస్థ గురించి మాట్లాడుతూ రమ్యకృష్ణ మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ అనేది అవసరానికి మించి ప్రాధాన్యత పొందిన వ్యవహారంగా అనిపిస్తుందని చెప్పారు. తాము ప్రేమలో ఉన్న సమయంలో కృష్ణవంశీ పెళ్లి చేసుకోవడం ఎందుకు? లివ్ ఇన్ రిలేషన్లో ఉందామని సూచించారట. అప్పుడే ఆయన మాటకు అంగీకరించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందని రమ్యకృష్ణ చెప్పడం విశేషం.
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, రెండు కుటుంబాలతో పాటు చుట్టూ ఉన్న సమాజం అంచనాలు, బాధ్యతలు కూడా ఇందులో భాగమవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కృష్ణవంశీతో తన అనుబంధంపై ఎలాంటి అసంతృప్తి లేదని, ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందని స్పష్టం చేశారు. ఆయనకు సినిమాలే ప్రపంచమని, ఆయన పని విషయంలో తాను జోక్యం చేసుకోనని, అలాగే తన సినిమా కెరీర్లోనూ ఆయన జోక్యం చేసుకోరని తెలిపారు. మొత్తానికి విడాకుల రూమర్స్‌కు చెక్ పెడుతూనే తన వైవాహిక జీవితం వెనుక ఉన్న అసలు విషయాలను రమ్యకృష్ణ బయటపెట్టారు. పెళ్లి, బంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
