movies

బాలీవుడ్‌లో హీరోయిన్ల రెమునరేషన్స్‌పై కృతి సనన్ బోల్డ్ కామెంట్స్!

4/11/2026

బాలీవుడ్‌లో హీరోయిన్ల రెమునరేషన్స్‌పై కృతి సనన్ బోల్డ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు దూసుకెళ్తున్నా.. బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లు సాధిస్తున్నా, పారితోషికాల విషయంలో మాత్రం ఇంకా 'మేల్ డామినేష‌న్' క‌నిపిస్తూనే ఉంది. ఈ విష‌యంపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల సినిమాలకు బడ్జెట్, రెమునరేషన్ విషయంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని ఆమె కుండబద్దలు కొట్టారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌ విషయంలో నిర్మాతలు ఇంకా సేఫ్ గేమ్ ఆడేందుకే చూస్తున్నారని కృతి అభిప్రాయపడ్డారు. "విమెన్ సెంట్రిక్ మూవీస్‌కు ఆడియన్స్ కనెక్ట్ కారనే ఒక అపవాదు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉంది. ఒకవేళ సినిమా బడ్జెట్ తగ్గించాల్సి వస్తే.. ఆలోచించకుండా ముందుగా హీరోయిన్ల రెమునరేషన్‌లోనే కోత పెడుతున్నారు" అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సంద‌ర్భంలో కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించడానికి తాజా ఉదాహరణే 'క్రూ' మూవీ అని కృతి అన్నారు. టబు, కరీనా కపూర్ వంటి స్టార్స్‌తో కలిసి తాను నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. స్టోరీ బలంగా ఉండి, మేకింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటే.. ఆడియన్స్ హీరో చేశాడా.. హీరోయిన్ చేసిందా అని చూడ‌ర‌ని, సినిమాను నెత్తిన పెట్టుకుంటారని 'క్రూ' సక్సెస్ నిరూపించిందని ఆమె స్పష్టం చేశారు.

కేవలం స్క్రీన్ మీద గ్లామర్ పాత్రలతో సరిపెట్టుకోకుండా.. 'బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్' పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి రియల్ లీడర్‌గా మారారు కృతి. 'దో పత్తి' లాంటి వైవిధ్యమైన సినిమాలతో తనతో పాటు మరికొంత మంది మహిళా టెక్నీషియన్లకు, నటులకు పెద్దపీట వేస్తూ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారామె. ఇండస్ట్రీలో ఈ పాత మైండ్‌సెట్ మారాలని, టాలెంట్‌కు తగ్గ ప్రతిఫలం అందరికీ సమానంగా దక్కాలని కోరుకుంటూ కృతి సనన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email