movies

సీనియ‌ర్ స్టార్స్‌తో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోటీ..ఫ్యామిలీ హీరోగా హ్యాట్రిక్ కొడతాడా?

16/11/2026

సీనియ‌ర్ స్టార్స్‌తో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోటీ..ఫ్యామిలీ హీరోగా హ్యాట్రిక్ కొడతాడా?

టాలీవుడ్‌లో ఒకప్పుడు నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్‌తో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అదే తరహా ఇమేజ్‌తో కిరణ్ అబ్బవరం కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా మెప్పించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నాడు. అందుకు రియాలిటీ సినిమాతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అంతేకాదు.. ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ కూడా పట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వైలెన్స్, యాక్షన్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఇరుముడి వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలపై ఆసక్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు కిరణ్ అబ్బవరం. తన రెగ్యులర్ ఇమేజ్‌కు భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రియాలిటీ థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. దీంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

గత ఏడాది విడుదలైన కే ర్యాంప్‌తో సక్సెస్ అందుకున్న కిరణ్.. ఈ ఏడాది చెన్నై లవ్ స్టోరీ మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా అతడి కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో క సినిమా సాధించిన రూ.50 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి, రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ స‌మాచారం. ఈ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో రియాలిటీపై ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది.

మరోవైపు ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. అయితే కిరణ్‌కు ఈసారి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ తప్పేలా లేదు. ఇప్పటివరకు తమిళ సినిమాలతో పోటీపడిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలతో తలపడాల్సి వస్తోంది.

డిసెంబర్ 24న బాలకృష్ణ నటిస్తున్న దాదా..అక్కినేని నాగార్జున కింగ్ 100 బరిలోకి దిగుతుండగా.. మరుసటి రోజే రియాలిటీతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంటే బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాల మధ్య తన సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ పోటీలో కిరణ్ అబ్బవరం పైచేయి సాధిస్తాడా? రియాలిటీతో మరోసారి ప్రేక్షకులను మెప్పించి కెరీర్‌లో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email