movies

‘టాక్సిక్’లోబోల్డ్ సీన్స్ గురించి నా భ‌ర్త ఏమ‌న్నారంటే.. కియారా అద్వానీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

12/11/2026

‘టాక్సిక్’లోబోల్డ్ సీన్స్ గురించి నా భ‌ర్త ఏమ‌న్నారంటే.. కియారా అద్వానీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

టాక్సిక్ సినిమా గురించి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ముుఖ్యంగా పెళ్లి తర్వాత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వంటి విషయాలపై ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. ఈ విషయంలో తన భర్త, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు ఇచ్చిన మద్దతు గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘టాక్సిక్’ సినిమా తొలి రోజే ప్రేక్షకులను నిరాశపరిచిందని కియారా పేర్కొన్నారు. భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, చివరకు సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం అంద‌రినీ బాధించిందన్నారు. సినిమా విడుదలైన త‌ర్వాత వ‌చ్చిన రిజ‌ల్ట్‌ తనను ఎంతో కుంగదీసిందని ఈ సంద‌ర్భంగా ఆమె తెలిపారు. అయితే కంఫర్ట్ జోన్‌ను దాటి కెరీర్‌లోనే ఎంతో కీలకమైన పాత్రలో నటించినందుకు నాకు ప్రశంసలు రావడం మాత్రం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.

అలాగే పెళ్లి తర్వాత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం గురించి కూడా కియారా స్పందించారు. ఈ విషయంలో సిద్ధార్థ్ మల్హోత్రా వైఖరి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఆయన ఎప్పుడూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేదని, తమ పెళ్లి తర్వాత కూడా దీనిపై ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు. తన నటన, కెరీర్ విషయంలో సిద్ధార్థ్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, పెళ్లి తర్వాత నటీమణులపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదని కియారా అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్‌లో జరుగుతున్న చర్చలను, ఈ విషయంలో పలువురు ప్రశ్నిస్తున్న తీరుని గమనించినప్పటికీ.. తన వ్యక్తిగత నిర్ణయాలకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని భావించినట్లు చెప్పారు.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email