నీల్‌తో ప్లానింగ్ మార్చిన తారక్.. ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా!
16/11/2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటి? అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ విషయంలో మేకర్స్ ఫాలో అవుతున్న కొత్త స్ట్రాటజీ ఏంటి? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో అనగానే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. అయితే మధ్యలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా తారక్, ప్రశాంత్ నీల్ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలకు మేకర్స్ చెక్ పెట్టారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా వరుస షెడ్యూల్స్‌తో సినిమాను పూర్తి చేసే పనిలో టీమ్ పని చేసుకూనే ఉంటుంది.
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న డ్రాగన్ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీని అనుసరిస్తోంది. రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసి, తక్కువ గ్యాప్‌లోనే రెండు సినిమాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దురంధర్ తరహాలో రెండు భాగాలతో ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది.
ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఇప్పటికే ప్రకటించిన 2027 జూన్ 11 విడుదల తేదీకి సినిమాను సిద్ధం చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. అదే జరిగితే ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పాలి. రెండు భాగాలు తక్కువ వ్యవధిలో విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
మరి ముందుగా డ్రాగన్ రెండు భాగాల షూటింగ్‌ను ప్రశాంత్ నీల్ ఎప్పుడు పూర్తి చేస్తారు? అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ..వరుస సినిమాలతో తారక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ ఖాయంగా కనిపిస్తోంది!
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
