movies

మళ్లీ విలన్‌గా గోపీచంద్‌.. చెక్ పెట్టిన టీమ్‌!

19/11/2026

మళ్లీ విలన్‌గా గోపీచంద్‌.. చెక్ పెట్టిన టీమ్‌!

టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాచో స్టార్ గోపీచంద్.. కెరీర్ ప్రారంభంలో విలన్‌గా కూడా అదరగొట్టారు. ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ వంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా ఆయన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే హీరోగా మారిన తర్వాత మళ్లీ విలన్ పాత్రల వైపు చూడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి గోపీచంద్ నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వివ‌రాల్లోకెళ్తే..

తమిళ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రంలో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించబోతున్నారంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ముఖ్యంగా సూర్య 49వ సినిమాకు సంబంధించిన చర్చల్లో గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టులో ఆయన కీలకమైన విలన్ పాత్ర పోషించనున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో చాలా కాలం తర్వాత గోపీచంద్‌ను మళ్లీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడబోతున్నామనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ ప్రచారానికి గోపీచంద్ టీమ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. సూర్య సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కోరింది. గోపీచంద్ తదుపరి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవైనా ఉంటే ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email