ఫ్యాషన్ పేరిట ప్రయోగాలు... కరీనా మెడకు చుట్టుకున్న 200 ఏళ్ల నాటి ఉచ్చు!
12/11/2026

బాలీవుడ్ హీరోయిన్లు ఫ్యాషన్ కోసం చేసే ప్రయోగాలు ఒక్కోసారి వాళ్ల మెడకే చుట్టుకుంటాయి. ఇప్పుడు కరీనా కపూర్ పరిస్థితి కూడా అచ్చం అలాగే తయారైంది. దీపావళి పండుగకు అందంగా ముస్తాబై, మెడలో ఒక పాతకాలపు నగ వేసుకుని ఫోటోలు పెడితే... కామెంట్ల రూపంలో పొగడ్తలు వస్తాయనుకుంటే, ఏకంగా లీగల్ నోటీసులు ఇంటికొచ్చాయి.
వివరాల్లోకి వెళితే... కరీనా కపూర్ రీసెంట్గా దీపావళికి వేసుకున్న డ్రెస్ మీద 200 ఏళ్ల నాటి భోపాల్ రాజకుటుంబానికి చెందిన ఓ కంఠహారాన్ని ధరించింది. 30 క్యారెట్ల ఎమరాల్డ్తో ఉన్న ఆ లాకెట్ మీద ఖురాన్‌లోని వాక్యాలు చెక్కి ఉన్నాయి. ఒకవైపు సంప్రదాయ దీపావళి దుస్తులు వేసుకుని, పవిత్రమైన వాక్యాలు ఉన్న ఆభరణాన్ని కేవలం ఓ ఫ్యాషన్ యాక్సెసరీగా వాడటం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది.
దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ మండిపడ్డారు. కరీనాతో పాటు ఆమె స్టైలిస్ట్ రియా కపూర్‌కు లీగల్ నోటీసులు పంపారు. వెంటనే ఆ ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించి, బహిరంగ క్షమాపణ చెప్పాలని... లేదంటే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. భోపాల్ చివరి నవాబు కూతురు, తన భర్త సైఫ్ అలీఖాన్ బామ్మ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ నగ... ఇప్పుడు కరీనాకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఈ వివాదంపై ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ డిస్కషన్ జరుగుతోంది. దీపావళికి ఫ్యాషన్ ఐకాన్‌గా మారదామనుకున్న కరీనా... అనుకోకుండా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
