movies

అప్పట్లో స్థోమతకు మించిన ఇల్లు.. ‘మన్నత్‌’ వెనుక కలను గుర్తుచేసుకున్న షారుఖ్‌!

12/11/2026

అప్పట్లో స్థోమతకు మించిన ఇల్లు.. ‘మన్నత్‌’ వెనుక కలను గుర్తుచేసుకున్న షారుఖ్‌!

ముంబైలోని ‘మన్నత్‌’ అభిమానులకు షారుఖ్‌ ఖాన్‌ చిరునామా. కానీ ఆయనకు మాత్రం అది సొంతింటి కోసం ఎన్నాళ్లుగానో కన్న కలకు రూపం. దుబాయ్‌లో జరిగిన ‘షారుఖ్జ్‌ రెసిడెన్సెస్‌ బై డాన్యూబ్‌’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న షారుఖ్‌.. తనకు ఇంటితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. గౌరీతో కలిసి కొన్న తొలి ఇల్లు మాత్రమే కాదు, మన్నత్‌ కూడా కొనుగోలు చేసిన సమయంలో తమ ఆర్థిక స్థోమతకు మించినదేనని గుర్తుచేసుకున్నారు.

తల్లిదండ్రులను చిన్న వయసులోనే కోల్పోయిన తనకు, సొంతంగా ఒక ఇల్లు ఉండాలనే కోరిక బలంగా ఉండేదని చెప్పారు. తన గతాన్ని సానుభూతి కోసం చెప్పడం లేదని కూడా స్పష్టం చేశారు. జీవితంలో సంతోషమైనా, కష్టమైనా.. తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు మనల్ని మనం సర్దుకుని, బయట ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తిని పొందుతామనేది ఆయన భావన.

ఈ ప్రయాణంలో గౌరీ పాత్రను కూడా షారుఖ్‌ గుర్తుచేసుకున్నారు. తమ తొలి ఇల్లు, తొలి కారు, కలిసి వేసిన ప్రతి అడుగు ఒక ప్రారంభమేనని ఆమె ప్రోత్సహించేదని తెలిపారు. ఇంటి అలంకరణ విషయంలో మాత్రం గౌరీదే తుది నిర్ణయమంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆమె డిజైన్లను మెచ్చుకోవడమే తమ పని అంటూ కార్యక్రమంలో నవ్వులు పంచారు.

సొంతింటి కల ఉన్నవారికి “Think big, believe big” అంటూ సందేశమిచ్చారు షారుఖ్‌. పెద్దగా ఆలోచించాలని, తమ కలపై నమ్మకం ఉంచాలని సూచించారు. ఆయన మాటల్లో మన్నత్‌ ప్రాధాన్యం దాని విలాసంలో కంటే.. ఇంటికి చేరుకున్నప్పుడు కలిగే భద్రత, కుటుంబంతో ఉన్న అనుబంధంలోనే కనిపించింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email