movies

Did Janhvi Kapoor Slip Up? Now She’s Busy with Damage Control!

10/11/2026

Did Janhvi Kapoor Slip Up? Now She’s Busy with Damage Control!

దేవర, పెద్ది సినిమాలతో టాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపారు. రీసెంట్‌గా పెద్ది సినిమాలో తన క్యారెక్టర్‌ గురించి చేసిన కామెంట్స్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ భామ, సడన్‌గా తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కోలీవుడ్ సినిమాలపై జాన్వీ కురిపించిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ పెద్ది సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ నటన కంటే గ్లామర్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. దీనికి తోడు రీసెంట్‌గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న జాన్వీ.. పెద్ది సినిమాలో తన సీన్స్‌ తనకే నచ్చలేదంటూ చేసిన కామెంట్స్‌ దుమారం రేపాయి. పూర్తి బౌండ్ స్క్రిప్ట్, కెమెరా యాంగిల్స్‌పై అవగాహన లేకుండా సౌత్‌లో పనిచేయడం కష్టమంటూ ఆమె చేసిన కామెంట్స్ మీద తెలుగు ఆడియన్స్‌ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

ఈ వివాదంతో జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేసేందుకు జాన్వీ కపూర్‌ మరో కొత్త ఇంటర్వ్యూతో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు. తన పిన్ని, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు జూనియర్ శ్రీదేవి. రీసెంట్‌గా తను చూసిన తమిళ సినిమా బ్లాస్ట్‌లో ప్రీతి ముకుందన్ యాక్టింగ్‌ బాగుందని, సాయి అభ్యంకర్ మ్యూజిక్ వీడియోలకు తాను పెద్ద ఫ్యాన్‌ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు డైరెక్టర్ వెట్రిమారన్ సినిమాలంటే చాలా ఇష్టమని, దళపతి విజయ్ పోక్కిరి లాంటి కమర్షియల్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తానంటూ సౌత్ ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశారు.

తన తండ్రి బోనీ కపూర్ రీమేక్ చేసిన తమిళ సినిమాలతో పాటు బొమ్మరిల్లు లాంటి మూవీస్‌ను రెగ్యులర్‌గా చూస్తుంటానని లేటెస్ట్ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు జాన్వీ. అయితే ఇన్నాళ్లూ లేనిది సడన్‌గా ఇప్పుడు జాన్వీ తమిళ జపం చేయడం మీద నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పెద్ది కాంట్రవర్సీ తర్వాత టాలీవుడ్‌లో ఇక అవకాశాలు రావని అర్థమయ్యే కోలీవుడ్‌ వైపు ఫోకస్‌ షిఫ్ట్‌ చేశారా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. మరి ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్లానింగ్‌ జాన్వీ కెరీర్‌కు ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email