movies

Dhanush Takes a Risk with ‘Om’… Can He Make a Comeback with a Big-Budget Film?

10/11/2026

Dhanush Takes a Risk with ‘Om’… Can He Make a Comeback with a Big-Budget Film?

‘ఓం’తో ధనుష్ రిస్క్.. భారీ బడ్జెట్ మూవీతో కమ్‌బ్యాక్ ఇస్తాడా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కెరీర్‌లో కీలక దశలో ఉన్నారు. వరుస సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తన మార్కెట్‌ను తిరిగి నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించినట్లు సహ నిర్మాత శ్రేయాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు. దీంతో ధనుష్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ‘ఓం’ నిలిచింది.

ఇక గత కొంతకాలంగా ధనుష్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు. ‘ఇడ్లీ కడై’, ‘కర’ వంటి చిత్రాలు తమిళంలో ఓకే అనిపించినప్పటికీ.. తెలుగు, హిందీ ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయాయి. మరోవైపు ‘కుబేర’, ‘తేరే ఇష్క్ మే’ వంటి సినిమాలు ఇతర భాషల్లో మంచి ఫలితాలు అందుకున్నప్పటికీ తమిళనాడులో డబ్బింగ్ వెర్షన్లకు ఆశించిన స్పందన రాలేదని ట్రేడ్ వర్గాల టాక్. దీంతో మార్కెట్‌లో ధనుష్ తన పట్టును తిరిగి సాధించాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ పరిస్థితుల్లో ‘ఓం’ సినిమాపై ధనుష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. మరోవైపు సినిమా ఔట్‌పుట్‌పై చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నవంబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా హిట్ అయితే ధనుష్‌కు భారీ కమ్‌బ్యాక్ లభించడంతో పాటు ఆయన మార్కెట్ కూడా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. మరి ‘ఓం’తో ధనుష్ తన పూర్వ వైభవాన్ని అందుకుంటారా? అన్నది చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email