అప్పుడేమో నో అబ్జెక్షన్. ఇప్పుడేమో పురుషాధిపత్యమంటూ విమర్శలా? రాధికా ఆప్టే వ్యాఖ్యలపై చర్చ!
3/11/2026

సినిమా ఇండస్ట్రీలో మహిళా నటీమణులకు ఎదురయ్యే వివక్ష, పురుషాధిపత్య ధోరణులపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. వీడియో గమనిస్తే ఆమె ఎక్కడా సినిమా పేరుని ప్రస్తావించలేదు. అయితే ఆమె లెజెండ్ సినిమా గురించే ప్రస్తావించినట్లు అర్థమవుతోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘అక్క’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటరాక్షన్‌లో రాధికా ఆప్టే ఈ కామెంట్స్ చేసింది. ఈ ఇంరాక్షన్లో కీర్తి సురేష్ కూడా ఉంది.
రాధికా ఆప్టే తెలుగు సినిమాలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఆమె ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారింది. తనకంటే చాలా పెద్ద వయసున్న హీరోతో రొమాన్స్ చేయడం, సినిమాలో తన పాత్రను మధ్యలోనే ముగించేయడం, సొంత కజిన్‌ను పెళ్లి చేసుకునేలా కథ ఉండటం వంటి అంశాలను ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ఇక్కడే ఓ ప్రశ్న తెరపైకి వస్తోంది. అప్పట్లో ఇవన్నీ తెలిసే సినిమా అంగీకరించారా? ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
2014లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన 'లెజెండ్' సినిమాలో రాధికా ఆప్టే కథానాయికగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతూ రాధికా కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఓ సినిమాలో తన మేనమామను పెళ్లి చేసుకునే పరిస్థితి ఉన్న పాత్రను చేయాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. అంతేకాదు.. తనకంటే వయసులో చాలా పెద్ద నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, సినిమా సగం పూర్తయ్యేసరికే తన పాత్రను చంపేశారని చెప్పుకొచ్చారు.
సినిమా ఒప్పుకునేటప్పుడే తెలియదా?
రాధికా ఆప్టే వ్యాఖ్యలతో ఇప్పుడు అసలు చర్చ మొదలైంది. ఏ సినిమా అయినా అంగీకరించే ముందు హీరో ఎవరు? కథేంటి? తన పాత్ర పరిధి ఎంత? అనే విషయాలను నటీనటులు తెలుసుకోవడం సహజం. అలాంటప్పుడు 'లెజెండ్' సినిమా విషయంలోనూ ఆమెకు ఈ వివరాలు ముందుగానే తెలిసే ఉంటాయి కదా? మరి తనకంటే పెద్ద వయసున్న హీరోతో రొమాన్స్ చేయడం ఇష్టం లేకపోతే అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? కథలో తన పాత్రకు సంబంధించిన అంశాలు నచ్చకపోతే సినిమా నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉండేది కదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హీరోయిన్ పాత్రలకు కథల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, హీరోల వయసుకు తగ్గట్టుగా హీరోయిన్లను ఎంపిక చేయకపోవడం వంటి అంశాలపై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలను ఒక కోణంలో చూడొచ్చు. మరోవైపు సినిమా అంగీకరించే సమయంలోనే తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే అవకాశం ఆమెకు లేదా? అనే ప్రశ్న కూడా ఉంది. సినిమా పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే సమస్యలు, పురుషాధిపత్య ధోరణులపై రాధికా ఆప్టే మాట్లాడటం తప్పు కాదు. ఆమె అనుభవాలను తక్కువ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యల్లోని సందర్భం, అప్పటి పరిస్థితులు, సినిమా అంగీకరించిన తీరు వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి ఇప్పుడు రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలతో ఆ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. మరి ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
