రెండు సినిమాలపై కన్నేసిన డార్లింగ్ ప్రభాస్ !
4/11/2026

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్‌తో సందడి చేయటానికి రెడీ అవుతున్నారు. ఒక సినిమా షూటింగ్ పూర్తవకముందే మరో సినిమాకు డేట్స్ కేటాయిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘కల్కి 2’ సినిమాల విషయంలో ప్రభాస్ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమవడంతో విడుదల తేదీని కూడా వాయిదా వేశారు. గతంలో డిసెంబర్ 2026లో విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఇప్పుడు వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో షూటింగ్‌ను మరింత ఆలస్యం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. అందుకే ప్రభాస్ కూడా ప్రస్తుతం ఫౌజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న మరో భారీ చిత్రం ‘కల్కి 2’ షూటింగ్ కూడా కొనసాగుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను ప్రభాస్ తిరిగి ప్రారంభించినట్లు సమాచారం.
అయితే ముందుగా ఫౌజీ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండటంతో కల్కి 2 షూటింగ్ షెడ్యూల్స్‌ను అందుకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారట. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి కల్కి 2 షూటింగ్‌ను పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం అవసరం. అందుకే షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారట. పైగా ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి నటుల డేట్స్‌ను సమన్వయం చేయడం కూడా చిత్ర బృందానికి పెద్ద టాస్క్‌గా మారిందని సమాచారం.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
