టాలీవుడ్‌కి తలనొప్పిగా మారిన బాలీవుడ్ బ్యూటీస్.. మనవాళ్ల ఇకనైనా మారుతారా!
5/11/2026

తెలుగు సినిమాల్లో అవకాశాలు.. స్టార్‌డమ్, భారీ రెమ్యునరేషన్లు.. తీరా పాపులారిటీ వచ్చాక టాలీవుడ్‌పైనే విమర్శలా? బాలీవుడ్ హీరోయిన్ల వ్యవహారంపై ఇండస్ట్రీలో నడుస్తోన్న హాట్ డిస్కషన్. టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా క్రేజ్ పెరుగుతున్న కొద్దీ ఇతర భాషలకు చెందిన హీరోయిన్లకు ఇక్కడ అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ భామలను మన దర్శక నిర్మాతలు తమ సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి మరీ స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కల్పిస్తున్నారు. అయితే తాజాగా కొందరు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల గురించి చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. అసలు మన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి, స్టార్‌డమ్ తెచ్చిపెడుతున్నా.. చివరికి టాలీవుడ్‌పైనే విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్లలో భాగంగా రాధిక ఆప్టే గతంలో తాను పనిచేసిన తెలుగు సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వయసులో పెద్ద హీరోతో జోడీ కట్టడం, పెళ్లి వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే గతంలో తెలుగు సినిమాతోనే పరిచయమైన తాప్సీ పన్ను కూడా దర్శకుడు రాఘవేంద్రరావు గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదానికి దారితీశాయి. ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ వ్యవహారం మరోసారి చర్చలోకి వస్తోంది.
మరోవైపు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ‘కాఫీ విత్ కరణ్’ షోలో తన తెలుగు సినిమా అనుభవాల గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న జాన్వీ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉంది. కొత్త హీరోయిన్స్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. అయినప్పటికీ స్టార్ హీరోల సినిమాలంటే బాలీవుడ్ భామల వైపే దర్శక నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని వారిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీ పారితోషికాలు, ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.
ఒక సినిమాలో నటించడానికి అంగీకరించే ముందు కథ, పాత్ర, క్యారెక్టరైజేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం నటీనటులకు ఉంటుంది. పాత్ర నచ్చకపోతే ఆ సినిమాను తిరస్కరించే స్వేచ్ఛ కూడా ఉంటుంది. అలాంటప్పుడు అన్నీ తెలిసి సినిమా చేసిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ గురించి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో తెలుగు దర్శక నిర్మాతలు తమ కాస్టింగ్ విషయంలో మరోసారి ఆలోచించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం బాలీవుడ్ మార్కెట్ కోసమే అక్కడి హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. మన దగ్గర టాలెంట్ ఉన్న హీరోయిన్స్‌కు పెద్ద సినిమాల్లో అవకాశాలు కల్పించాలనే వాదన వినిపిస్తోంది.
మొత్తానికి బాలీవుడ్ భామల వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో ఓ కొత్త చర్చ మొదలైంది. పాన్ ఇండియా క్రేజ్ కోసం ఇతర భాషల హీరోయిన్లను తీసుకోవడం కంటే, తెలుగు అమ్మాయిలకు కూడా గ్లోబల్ స్టేజ్‌పై సత్తా చాటే అవకాశాలు కల్పించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది. మరి మన దర్శక నిర్మాతలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
