movies

Bobby Simha’s Telugu Film… Will a Star Hero’s Daughter Producing the Movie Bring Him Good Luck?

10/11/2026

Bobby Simha’s Telugu Film… Will a Star Hero’s Daughter Producing the Movie Bring Him Good Luck?

బాబీ సింహ తెలుగు సినిమా..స్టార్ హీరో కుమార్తె నిర్మాణంలో ల‌క్ క‌లిసొచ్చేనా!

నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని నందమూరి ప్రస్తుతం సినీ నిర్మాణ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య సినిమాలతో పాటు పలు ప్రాజెక్టుల్లో తెరవెనుక బాధ్యతలు చూసుకుంటున్న ఆమె.. ఇప్పుడు సొంతంగా విభిన్నమైన కథలతో సినిమాలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె నిర్మాణంలో రూపొందనున్న ఓ కొత్త ప్రాజెక్ట్ ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విలక్షణమైన నటనతో తమిళం, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాబీ సింహా.. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆసక్తిని పెంచుతోంది. అయితే ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తేజస్విని ఈ సినిమాను కేవలం కమర్షియల్ అంశాలకే పరిమితం చేయకుండా, కథకు ప్రాధాన్యత ఉన్న కాన్సెప్ట్‌తో రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం. యువ నటీనటులతో కొత్త తరహా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తేజస్విని బాలకృష్ణ సినిమాల నిర్మాణం, ప్రమోషన్లలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు స్వతంత్రంగా నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. మరి ఈ కొత్త ప్రాజెక్ట్‌లో బాబీ సింహా పాత్ర ఎలా ఉండబోతోంది? తేజస్విని ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? అనే విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email